అమరావతి : మాజీ వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో ఇవాళ ఈడీ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా తనను ప్రశ్నించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది, దీంతో ఈడీ విచారణ ప్రారంభమైంది. రూ. 3,500 కోట్ల ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ నిమిత్తం మాజీ వైఎస్సార్‌సిపి నాయకుడు వి. విజయ సాయి రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం, ఈ కేసులో మరింత సమాచారం కోరుతూ, ఈడీ హైదరాబాద్ యూనిట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సిపి ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరాదారుల నుండి వసూళ్ల ద్వారా రూ. 3,500 కోట్ల నిధులను దారి మళ్లించారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఆ కాలంలో విజయ సాయి రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది, దీంతో ఈడీ విచారణ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ స్కాం చర్చనీయంశంగా మారింది. ఇదే లిక్కర్ స్కాం కేసు దెబ్బకు ఢిల్లీలో ఆప్ సర్కార్ కూలి పోయింది. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ డాన్ గా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.


















