ముంబై : జునైద్ ఖాన్, సాయి పల్లవి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ఏక్ దిన్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఆమిర్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ లు నిర్మించారు. స్నేహా దేశాయ్, స్పందన్ మిశ్రా స్క్రీన్ ప్లే అందించారు. రామ్ సంపత్ సంగీతం అందించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మూవీ మేకర్స్ వెల్లడించారు. కాగా ఏక్ దిన్ చిత్రాన్ని వచ్చే మే నెల ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ఏక్ దిన్ మూవీకి సునీల్ పాండే దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రానికి మరో విశేషం ఉంది. ప్రముఖ అగ్ర నటుడు ఆమిర్ ఖాన్‌కు చెందిన ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది. గందరగోళంగా మారిన జీవితంలో ప్రేమ మిమ్మల్ని పలకరించేలా చేస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఇక నేచురల్ నటిగా గుర్తింపు పొందింది నటి సాయి పల్లవి. తను గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా మూవీలో ప్రేమికురాలిగా నటించింది..మెప్పించింది. ప్రేక్షకుల మనసు దోచుకుంది. కాగా 2025 నవంబర్ లోనే ఏక్ దిన్ విడుదల కావాల్సి ఉంది.


















