హైదరాబాద్ : దర్శకుడిగా, నిర్మాతగా సామాజిక విలువలకు పెద్దపీట వేస్తూ వచ్చాడు వేణు ఉడుగుల. తను తాజాగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాను నిర్మించాడు. ఇది ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ గా నిలిచింది. టాప్ మూవీస్ ను తట్టుకుని నిలబడింది. ఆశించిన దానికంటే అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. తాజాగా నిర్మాత, దర్శకుడు వేణు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు దర్శకులుగా తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. వారిలో రామ్ గోపాల్ వర్మ, వంగా సందీప్ రెడ్డి, సుకుమార్, పూరీ జగన్నాథ్, తదితరులు ఉన్నారు. వీరి సరసన వేణు ఉడుగుల కూడా తాజాగా చేరాడు. తను తీయబోయే హిందీ ప్రాజెక్టు కోసం సిద్దమయ్యాడు. ఇందు కోసం హరందర్ సిక్కా కథ రాశాడు. ఇద్దరూ ఇవాళ జతకట్టారు.
ఈ సందర్బంగా దర్శక, నిర్మాత వేణు ఉడుగుల మీడియాతో మాట్లాడాడు. హరిందర్ సిక్కా ఇచ్చిన కథతో నా హిందీ దర్శకత్వ రంగ ప్రవేశం చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నాడు. ఇది నిజంగా నాకు ఒక కలల ప్రాజెక్ట్ అని తెలిపాడు. ఇదిలా ఉండగా సిక్కా గూఢచారి థ్రిల్లింగ్ మూవీ కాలింగ్ సెహమత్ మూవీతో రచయితగా పేరు పొందాడు. ఇందులో ఆలియా భట్ నటించింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హిందీ లో ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నామని తెలిపారు వేణు ఉడుగుల. ఇది నా జీవితంలో మరిచి పోలేనని అన్నాడు దర్శక, నిర్మాత.

















