Nara Lokesh : నెల్లూరు జిల్లా – రాబోయే రోజుల్లో ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే ఉత్తమంగా తీర్చి దిద్దుతానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. నెల్లూరులో సుమారు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విఆర్ స్కూలును మంత్రి \ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ నెల్లూరు విఆర్ హైస్కూల్ దేశంలోనే నంబర్ వన్ మోడల్ స్కూల్ గా అవతరిస్తుందన్నారు. ఈ పాఠశాలను దేశంలోనే ఆదర్శ వంతంగా తీర్చిదిద్దడానికి మంత్రి నారాయణ రూపకల్పన చేశారని ప్రశంసించారు. నెల్లూరు నగరంలోని VR (వెంకటగిరి రాజా) ఉన్నత పాఠశాల 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నారు.
Minister Nara Lokesh Comments
1875 లో స్థాపించబడిన ఈ పాఠశాల నెల్లూరుకు గర్వ కారణంగా నిలిచిందన్నారు. మంత్రి నారాయణ నాయకత్వంలో VR మున్సిపల్ ఉన్నత పాఠశాల తిరిగి ప్రారంభించడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఇక్కడ చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారని చెప్పారు నారా లోకేష్. దివంగత బెజవాడ గోపాల్ రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారు ఈ పాఠశాల పూర్వ విద్యార్థులేనని గుర్తు చేశారు. విఆర్ స్కూలు సౌకర్యాలు చూసి నాకు ఆనందం కలుగుతోందన్నారు.
మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో కూడా ఇదేవిధంగా స్కూలును అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు నారా లోకేష్. రాబోయే అయిదేళ్లలో విఆర్ హైస్కూలు తరహాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నియోజకవర్గాల్లో లీప్ మోడల్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ మన ముందున్న మంత్రి నారాయణ విఆర్ పాఠశాలలో 5 నుండి 10వ తరగతి వరకు చదివారని తెలిపారు. చదువు పూర్తయ్యాక అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారని అన్నారు. వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో ఆధునీకరించిన విఆర్ పాఠశాలలో ఈ ఏడాది 1,050 మంది నిరుపేద విద్యార్థులు డిజిటల్ విద్యను పొందుతారని చెప్పారు.
Also Read : Srisailam Project Level Alarming : గరిష్ట నీటి మట్టంకి చేరుకున్న శ్రీశైలం ప్రాజెక్టు


















