హైదరాబాద్ : క్రిస్మస్ స్ఫూర్తిని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ గుర్తు చేసుకున్నారు, వ్యక్తిగత జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు. క్రిస్మస్ అనేది ఆనందం, ఐక్యత సీజన్ అని ఇది సమాజంలో ప్రేమ, శాంతి, కరుణ సందేశాన్ని వ్యాపింప జేస్తుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ క్రిస్టియన్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొహమ్మద్ అజారుద్దీన్. క్రైస్తవ సంస్థలతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు . తాను క్రైస్తవ సంస్థలో చదువుకున్నానని, అక్కడ ప్రతి సంవత్సరం క్రిస్మస్ నిజమైన స్ఫూర్తిని అనుభవించే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు అజారుద్దీన్. స్నేహితులు, ఉపాధ్యాయులతో కలిసి సామరస్యం , సద్భావన వాతావరణంలో క్రిస్మస్ జరుపు కోవడాన్ని తాను మరిచి పోలేనని చెప్పారు అజారుద్దీన్.
బాక్సింగ్ డే వేడుకల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. బాక్సింగ్ డే రోజున క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం తన విద్యార్థి రోజుల్లో ఎంతో విలువైన సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ అనుభవాలు తనకు క్రమశిక్షణ, జట్టు కృషి, క్రీడా స్ఫూర్తి, పరస్పర గౌరవం విలువలను నేర్పించాయని చెప్పారు మహమ్మద్ అజారుద్దీన్ క్రిస్మస్ ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం, అణగారిన వారి పట్ల శ్రద్ధ వహించడం, సమాజాల మధ్య బంధాలను బలోపేతం చేయడం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని అజారుద్దీన్ నొక్కి చెప్పారు. క్రిస్మస్ వంటి పండుగలు మత సామరస్యాన్ని పెంపొందించడంలో , భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే పురాతన సంప్రదాయాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో సెక్రటేరియట్ క్రిస్టియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు శాస్త్రి, చిట్టి బాబు, శశిభూషణ్, జాకబ్ భూంపాగ్, తదితరులు పాల్గొన్నారు.
















