Raj Thackeray : మహారాష్ట్ర – మరాఠా రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి దాకా బద్ద శత్రువులుగా ఉన్న ఉద్దవ్ థాక్రే (Uddhav Thackeray), రాజ్ థాక్రేలు ఒకే వేదికను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఇద్దరు విడి పోయి దాదాపు 20 సంవత్సరాలకు పైగా అయ్యింది. ఇకపై తాము కలిసే ఉంటామని ప్రకటించారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలులో ఉండేది. తాజాగా బీజేపీ సంకీర్ణ సర్కార్ ఊహించని విధంగా మరాఠా వాసులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మేరకు త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఇటీవల ఉపసంహరించు కుంటున్నట్లు ప్రకటించింది.
Raj Thackeray and Uddhav Thackeray Meeting
ముంబై వేదికగా వాయిస్ ఆఫ్ మరాఠీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ ఇద్దరు నేతలు. నిన్నటి దాకా ఎడమొహం పెడ మొహంగా ఉంటూ వచ్చారు. రాజ్, ఉద్దవ్ సోదరులు సిద్దాంత రీత్యా 2005 సంవత్సరంలో విడి పోయారు. ఈ ఇద్దరు కలుసు కోవడం పట్ల ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్బంగా రాజ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉద్దేశించి. సీఎం వల్లే విడి పోయిన తాము కలుసుకున్నామని, తనకు థ్యాంక్స్ తెలియ చేస్తున్నామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై అన్నదమ్ములు ఇద్దరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరాఠా ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు ప్రయత్నం చేసినా ఊరుకునేది లేదన్నారు.
Also Read : TG High Court Fired – HYDRA : హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు సీరియస్


















