CP Sajjanar : హైదరాబాద్ : హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన 10 రౌడీ గ్యాంగ్ లకు ఝలక్ ఇచ్చారు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar). శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై ఫోకస్ పెట్టారు. పది ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను ఆయన టీజీఐసీసీసీకి పిలిపించారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు. నగరంలోని సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై నజర్ ఉంచామన్నారు. ఈ నేపథ్యంలో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ, ప్రత్యర్థి ముఠాలపై దాడులకు తెగబడుతున్న వారిని పోలీస్ కమిషనర్ విచారించారు.
CP Sajjanar Shocking Old Town Rowdy Gangs
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 126 కింద 86 మందిని కమిషనర్ బైండోవర్ చేశారు. రాబోయే ఏడాది కాలం పాటు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో ఉంటామని వారి చేత సెక్యూరిటీ బాండ్లు రాయించుకున్నారు. బాండ్ రాసిచ్చిన కాలపరిమితిలోపు ఎవరైనా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని సీపీ సజ్జనర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్‌ను రద్దు చేయడంతో పాటు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విచారణలో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె.అపూర్వా రావు, సంబంధిత ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
Also Read : CM Revanth Reddy New Innovation : డిసెంబర్ 6న ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్















