Anirudh Reddy : పాలమూరు జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి నిప్పులు చెరిగారు. తాజాగా సినీ రంగంపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేయడం కలకలం రేపింది. విచిత్రం ఏమిటంటే తను ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆంధ్రకు చెందిన సినీ నిర్మాతలను టార్గెట్ చేశారు. వారి వల్లనే మోసం జరుగుతోందని ఆరోపించారు. ఆంధ్రా సినీ నిర్మాతలే జనాన్ని దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు జనంపల్లి అనిరుధ్ రెడ్డి. తమ తెలంగాణ ప్రాంతానికి చెందిన నిర్మాతలు కానీ, ఇతరులు కానీ అలా దోచుకునే మనస్తత్వం కాదన్నారు.
MLA Anirudh Reddy Shocking Comments
సినీ రంగానికి సంబంధించి వచ్చిన ఆదాయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సినీ కార్మికులకు 20% శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సినిమా యాక్టర్లను పక్కన పెట్టుకుని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టడంపై కూడా జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన నిర్వాకంపై జనాలు తప్పు బడుతున్నారని అన్నారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న సీపీ ఇలా చేయడం మంచి పద్దతి కాదన్నారు. దొంగలను పక్కన పెట్టుకుని మాట్లాడటం దారుణమన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే ప్రజలు అధికారులను తిట్టరు, ప్రభుత్వాన్ని తిడతారని, అది గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ఐ-బొమ్మ రవి విషయంలో న్యాయస్థానాలు చూసుకుంటాయని అన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
Also Read : CM Revanth Reddy Important Meet : 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం



















