T Rajaiah : వరంగల్ జిల్లా : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (T Rajaiah) సంచలన కామెంట్స్ చేశారు . ఆయన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎక్కడ ఎన్నికలు వస్తాయో అని కడియం శ్రీహరికి భయం పట్టుకుందన్నారు. పార్టీలు మారడం, అవినీతి చేయడం తనకు బ్రాండ్ గా మారిందంటూ మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మారడం కడియంకు అలవాటుగా మారిందన్నారు. రేపు బీజేపీ వాళ్లు కేంద్ర మంత్రి పదవి ఇస్తామంటే వెంటనే తండ్రి కూతుళ్లు ఆ పార్టీకి వెళ్లి పోతారంటూ ఫైర్ అయ్యారు. వాళ్లకు రాజకీయ విలువలు అంటూ ఏవీ లేవన్నారు. కేవలం పదవి కోసమే ఇదంతా చేస్తున్నారని అన్నారు.
T Rajaiah Slams Kadiyam Srihari
అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన అని చెప్పిండు, ఎన్ని నిధులు తెచ్చాడో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము ఉందా కడియంకు అంటూ ప్రశ్నించారు తాటికొండ రాజయ్య. కేవలం కులం అడ్డుపెట్టుకుని, గ్రూపు రాజకీయాలు చేస్తూ కడియం అంటే బ్రాండ్ అని చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. గతంలో టీడీపీలో, బీఆర్ఎస్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ..ఇంకా ఎన్ని పార్టీలు మారుతాడో ఆయనకే తెలియాలని అన్నారు. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలంటూ కడియం శ్రీహరికి హితవు పలికారు తాటికొండ రాజయ్య.
Also Read : Telangana EC Important Update : స్థానిక సంస్థల ఎన్నికలకు వేళాయె
















