Reba Monica John : సినీ రంగానికి చెందిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది రంగుల ప్రపంచం. ఛాన్సుల కోసం పెద్ద ఎత్తున తరలి వస్తుండడం షరా మూమూలే. హీరోయిన్లతో పాటు చాలా మంది తారలు, చిన్న చిన్న పాత్రల కోసం వేచి చూస్తున్న వారంతా పెద్ద ఎత్తున వాపోతున్నారు.
Reba Monica John Shocking Comments
కానీ వారికి అవకాశాలు రావడం లేదు. ఇంకొందరు తమకు ఛాన్స్ లు రావేమోనన్న ఆందోళనతో నోరు విప్పడం లేదు. గత కొంత కాలంగా క్యాస్టింగ్ కౌచ్ సంచలనంగా మారింది. ఇప్పటికే కొందరు నిర్మాతలు, దర్శకులు పేరు చెప్పేందుకు వీలు ఉండడం లేదు.
నటి పూనమ్ కౌర్ అయితే ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు తనను సపోర్ట్ గా ఉంటూ వచ్చిన డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై బాంబు పేల్చింది. హీరోయిన్లను వాడుకుని వదిలి వేయడం అలవాటుగా మారిందని, తనను విచారించాలని తెలుగు ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదంటూ వాపోయింది.
ఈ తరుణంలో ఉన్నట్టుండి కన్నడ సినీ రంగానికి చెందిన నటి రెబా మోనికా జాన్(Reba Monica John) సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తాను సినిమాలలో ఛాన్స్ ల కోసం వెళితే నిర్మాతలు కమిట్మెంట్ అడిగారని, ఇంకొందరు డేటింగ్ కు వస్తావా అని బహిరంగంగానే అడిగారంటూ వెల్లడించింది.
Also Read : Beauty Pooja Hegde :వెబ్ సీరీస్ పై బుట్టబొమ్మ ఫోకస్