Venkatesh : అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి కీలకమైన అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ చిత్రం రికార్డ్ బ్రేక్ చేసింది. సంక్రాంతి పండుగ సందర్బంగా దీనిని విడుదల చేశారు. తొలి షో నుంచే వసూళ్ల వేట కొనసాగించింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అత్యంత జనాదరణ పొందింది ఈ మూవీ.
Victory Venkatesh Sankranthiki Vasthunnam OTT Updates
ఇంటిల్లిపాది నవ్వుకునేలా దీనిని తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. తనకు టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడిగా పేరుంది. ఇందులో నటించిన బుడ్డోడు బుల్లిరాజు పాత్ర సూపర్ . ఆద్యంతం కామెడీని పండించారు విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి. మాజీ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి రెచ్చి పోతే ఐశ్వర్య భార్యగా సూపర్ గా నటించింది..మెప్పించింది. ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఇక సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) చిత్రాన్ని స్వంతం చేసుకునేందుకు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు ప్రముఖ మీడియా సంస్థ జీ గ్రూప్ జీ5 స్వంతం చేసుకుంది. ఇప్పటికే మిమ్మల్ని మరోసారి నవ్వించేందుకు రెడీగా ఉంది అంటూ ప్రకటించేశారు. అయితే ఓటీటీ కంటే ముందు జీ తెలుగులో టెలికాస్ట్ చేస్తారని స్పష్టం చేసింది. ఇక సినిమా సక్సెస్ కావడానికి బుల్లిరాజు ఒకరైతే మరొకరు బీమ్స్ సిసిలెరో అందించిన సంగీతం. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచేందుకు కారణమైంది. మొత్తంగా వెంకటేశ్ సినీ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.
Also Read : Babu Mohan Shocking :విషమిచ్చి చంపాలని చూశారు