CS Ramakrishna : హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ ఎత్తున ఐపీఎస్ లను బదిలీ చేసింది. గంపగుత్తగా 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం సంచలనం కలిగించింది.
ఈ బదిలీ అయిన వారిలో అదనపు డీజీపీలు, కమిషనర్లు, ఎస్పీలు, ఏఎస్పీలు బదిలీ అయ్యారు; పోస్టింగ్ కోసం వేచి ఉన్న పలువురు అధికారులకు కొత్త పదవులు కేటాయించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPL.B) శాఖ కొత్త నియామకాలను వివరిస్తూ G.O.Rt.No.1632ను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో వివిధ భాగాలు ఉన్నాయి. ఆ ఉత్తర్వు ప్రకారం సీనియర్ ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్ (1997)ను డీజీపీ కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పర్సనల్)గా నియమించారు. ఆయన హైదరాబాద్‌లోని మల్టీజోన్-2 ఏడీజీపీగా పూర్తి అదనపు బాధ్యతను కూడా నిర్వహిస్తారని స్పష్టం చేశారు సీఎస్ (CS Ramakrishna).
CS Ramakrishna Key Update on IPS Transfers
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (పరిపాలన) జె. పరిమల హనా నూతన్ జాకబ్ (ఐపీఎస్ 2009) బదిలీ అయ్యారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిఐడిగా నియమితులయ్యారు. డాక్టర్ చేతన మైలబతుల (ఐపీఎస్ 2013) డిప్యూటీ డైరెక్టర్, ఆర్‌బివిఆర్ఆర్ టిజిపిఎగా నియమించింది. కె. నారాయణ రెడ్డి (2013) డిసిపి మహేశ్వరం జోన్ గా , పి.వి. పద్మజ (2013) తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ (అడ్మిన్)గా నియమితులయ్యారు. 2017–2023 బ్యాచ్‌ల అధికారులు కూడా కీలక పోస్టింగ్‌లను పొందారు. వారిలో చెన్నూరి రూపేష్ (2017) హైదరాబాద్‌లో SM అండ్I DCPగా నియమితులయ్యారు. స్నేహ మెహ్రా (2018) వికారాబాద్ ఎస్పీగా నియమించారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులతో సహా బహుళ అదనపు ఎస్పీలుగా, ఎస్డీపీఓలుగా, ఏఎస్పీలుగా బదిలీ చేయబడ్డారు. గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న 2023 బ్యాచ్ నుండి కొత్తగా చేరిన ఐపీఎస్ అధికారులను కూడా ఫీల్డ్ పోస్టింగ్‌లు కేటాయించారు.
Also Read : Tiruchanoor Lakshmi Kasula Haram Interesting : ఘనంగా లక్ష్మీ కాసుల హారం శోభా యాత్ర


















