Prem Kumar : తమిళ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీసిన 96 మూవీ గురించి ఆ హీరో కోసం రాయలేదన్నాడు. బాలీవుడ్ హీరో బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్ ను దృష్టిలో పెట్టుకుని తీశానని చెప్పాడు. అయితే ఈ చిత్రం ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Director Prem Kumar Story
అద్భుతమైన కథ, అంతకు మించిన భావోద్వేగాలను ప్రతిఫలించేలా ప్రయత్నం చేశాడు. ఇందులో ప్రధాన పాత్రలలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో పాటు లవ్లీ బ్యూటీ త్రిష కృష్ణన్ నటించారు. విజయ్ సేతుపతిని ముందుగా తాను అనుకోలేదన్నాడు. కథ సిద్దం చేసుకునే సమయానికి తాను ఎలా బచ్చన్ ను సంప్రదించాలో అర్థం కాలేదని పేర్కొన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి కాంటాక్ట్స్ లేక పోవడం కొంత ఇబ్బంది పడ్డానని అన్నారు.
చిట్ చాట్ సందర్భంగా దర్శకుడు ప్రేమ్ కుమార్(Prem Kumar) మాట్లాడారు. తాను ఎక్కువగా ఉత్తరాదిలోనే ఉన్నానని ఆ తర్వాత బతుకు దెరువు కోసం తమిళనాడులో ఉంటున్నామన్నాడు. హిందీ మీద పట్టుంది. అంతే కాదు బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. తనకు నసీరుద్దీన్ షా అంటే చచ్చేంత ఇష్టమని పేర్కొన్నాడు. తనను దృష్టిలో పెట్టుకుని కథ సిద్దం చేసుకున్నానని తెలిపాడు. 96 ను భారీగా ఆదరించడంతో సీక్వెల్ గా తీస్తున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే షూటింగ్ మొదలు అవుతుందన్నారు.
Also Read : Hero Ram Charan-Rashmika :చెర్రీ సరసన రష్మిక మందన్న