CM Chandrababu Important Comments : బీహార్ అభివృద్దిలో దూసుకు పోవ‌డం ఖాయం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కామెంట్స్

Hello Telugu - CM Chandrababu Important Comments

Hello Telugu - CM Chandrababu Important Comments

CM Chandrababu : పాట్నా : స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడు మ‌రోసారి బీహార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నితీశ్ కుమార్ కొలువు తీరార‌ని పేర్కొన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). గురువారం రాష్ట్ర రాజ‌ధాని పాట్నా వేదిక‌గా జ‌రిగిన సీఎం ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ముఖ్య అతిథులుగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ , కేంద్ర మంత్రులు జేపీ న‌డ్డా, అమిత్ చంద్ర షాతో పాటు త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ , త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. త‌న‌కు ఎన్నో ఏళ్ల నుంచి నితీశ్ కుమార్ తో ప‌రిచయం ఉంద‌న్నారు. ఆయ‌న చిన్న‌ప్ప‌టి నుంచి సోష‌లిస్టు భావ‌జాలం నుంచి పైకి వ‌చ్చాడ‌ని అన్నారు. జేపీ ప్ర‌భావం త‌న‌పై ఉంద‌న్నారు. గ‌త 20 ఏళ్లుగా సీఎంగా రాష్ట్రాన్ని పాలించ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు.

CM Chandrababu Key Comments on Bihar

ఇదే స‌మ‌యంలో నితీశ్ కుమార్ 10వ సారి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం విశేష‌మ‌న్నారు. అపార‌మైన రాజ‌కీయ నైపుణ్యం, అనుభ‌వం ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో భార‌త దేశానికి దిశా నిర్దేశం చేసే నాయ‌కుడు ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ ఉండ‌డం మ‌రింత మేలు చేకూరుస్తుంద‌న్నారు. మోదీ, నితీశ్ కుమార్ ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో బీహార్ రాష్ట్రం మ‌రింత ముందుకు వెళుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు. అంత‌కు ముందు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు యోగి ఆదిత్యనాధ్, దేవేంద్ర ఫడ్నవిస్ లను మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘావాల్, బీజేపీ అగ్ర నేత రవిశంకర్ ప్రసాద్, బీహార్ రాష్ట్రంలోని బీజేపీ, జేడీయూకు చెందిన పలువురు నేతలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమావేశమయ్యారు.

Also Read : Women Boxer Arundhati Victory : ప్ర‌పంచ బాక్సింగ్ క‌ప్ ఫైన‌ల్స్ లో అరుంధ‌తి విక్ట‌రీ

Exit mobile version