CP VC Sajjanar : హైదరాబాద్ : మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌లో వస్తున్న బెదిరింపులు, దుర్భాష లాడటంపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ హామీ ఇచ్చారు. స్వతంత్ర జర్నలిస్టు తులసి చందు సహా పలువురు మహిళా జర్నలిస్టులు కమిషనర్‌కు ఫిర్యాదు సమర్పించారు. తమపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్, వేధింపులు, బెదిరింపులు, అసభ్య దాడుల వివరాలను వారు అందించారు. జర్నలిస్టుల ప్రతినిధి బృందం ట్రోలింగ్ స్వరూపాన్ని చూపించే అనేక వీడియోలను కమిషనర్‌కు ప్లే చేసి చూపించింది. పలు సోషల్ మీడియా హ్యాండిల్లు నిరంతరం విద్వేష వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, దాడులు చేస్తూ మహిళా జర్నలిస్టులను అవమానించాలని, భయ పెట్టాలని చూస్తున్నాయని వారు వాపోయారు.
CP VC Sajjanar Supports
సజ్జనార్ (CP VC Sajjanar) అందుబాటులో ఉన్న లింకులు, స్క్రీన్‌షాట్లు, వీడియోలను తన కార్యాలయానికి ఇవ్వాలని కోరారు.చర్యలు తీసుకుంటాం. మీరు త్వరలో చూస్తారు. చర్యల తర్వాత మళ్లీ మాట్లాడుతానంటూ సీపీ మహిళా జర్నలిస్టులకు అభయం ఇచ్చారు. కావాలని బెదిరింపులు, దూషణలు సమన్వయంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో మహిళా జర్నలిస్టులు తమపై “క్రమబద్ధమైన ఆన్‌లైన్ వేధింపుల ధోరణి” కొనసాగుతోందని తెలిపారు. కొన్ని హ్యాండిల్లు, ఉద్దేశ పూర్వకంగా అసభ్య వ్యాఖ్యలు, ప్రాణహానికర బెదిరింపులు, అవహేళనాత్మక పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నాయని చెప్పారు. తమ నివాస చిరునామాలు తెలుసునని కొందరు బహిరంగంగా చెప్పిన విషయాన్ని కూడా వారు ఫిర్యాదులో చేర్చారు.
Also Read : Harish Rao Fired on Telangana Govt : సర్కార్ నిర్లక్ష్యం పత్తి రైతులకు శాపం















