Telangana High Court : హైదరాబాద్ : నువ్వు ఏమైనా సుప్రీం అనుకుంటున్నావా, ఎన్నిసార్లు చెప్పినా నీ పనితీరు మార్చుకోక పోతే ఎలా..ఇలాగైతే చర్యలు తప్పవంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు (Telangana High Court) హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు. ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదని పేర్కొంది. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చంది. తాము చేసే చర్యలు ఏవైనా సరే చట్ట పరిమితుల్లోనే ఉండాలని ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అధికారం ఇచ్చింది బల ప్రదర్శనం కోసం కాదని, వేధింపులకు, భయభ్రాంతులకు గురి చేయడం కాదని గుర్తు పెట్టుకోవాలని సూచించింది ఏవీ రంగనాథ్ కు. ప్రజలకు మంచి చేయడం కోసమని, మానవతావాదిగా ఉండాలని హితవు పలికింది.
Telangana High Court Slams Hydraa Commission
ఏ ఒక్కరి మెప్పు కోసమో మీ పదవిని తాకట్టు పెట్టేలా ప్రవర్తించడం మంచి పద్దతి కాదని పేర్కొంది హైకోర్టు. కోర్టుకే అధికారాలు ఎక్కువ ఉంటాయని, తాము జోక్యం చేసుకునే పరిస్థితులు తీసుకు రావొద్దని రంగనాథ్‌కి వార్నింగ్ ఇచ్చింది. కూల్చివేతలు చేపట్టే ముందు ముందస్తు నోటీసులు జారీ చేయాలని, విచారణ తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం కరెక్ట్ కాదని.. శిథిలాలను రోడ్డు మీదే వదిలేసి వెళ్తున్నారంటూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మంచి చేస్తున్నామని చెప్పి ప్రజలకు అన్యాయం చేయొద్దని.. వీకెండ్స్‌లో కూల్చేస్తే బాధితులు ఎక్కడికి వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.
Also Read : Minister Uttam Kumar Challenge : ప్రతీ రోడ్డును డబుల్ రోడ్లుగా మారుస్తాం


















