Justice Gavai : అమరావతి : భారత దేశంలో ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice Gavai). భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీజేఐతో పాటు, ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు సీజేఐ . సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా నాకు ఇదే చివరి సమావేశం అని చెప్పారు. నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి. ఈ కార్యక్రమం కూడా అమరావతిలోనే ఉండడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు జస్టిస్ గవాయ్.
Justice Gavai Comments
ఈ సందర్బంగా భారత రాజ్యాంగం, ప్రజాస్వామిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నాను సీజేఐగా. సాంఘిక, ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందు పరిచారని చెప్పారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలని స్పష్టం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఓ స్థిర పత్రంగా భావించ లేదన్నారు. కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారని చెప్పారు జస్టిస్ గవాయ్. కొన్ని అంశాల్లో రాజ్యాంగ సవరణ సులభం, కొన్ని అంశాల్లో అది చాలా కఠినంగా ఉంటుందన్నారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. ఈ కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకు సమ ప్రాధాన్యం దక్కిందన్నారు.
Also Read : Hydraa Commission Important Support : బాధితులకు హైడ్రా కమిషనర్ భరోసా


















