Japan : విశాఖపట్నం : ఏపీ సర్కార్ తో జపాన్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖ వేదికగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో భారతదేశంలో జపాన్ (Japan) రాయబారి హెచ్ ఈ ఒనో కెయిచి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. చాలా అంశాలపై చర్చించారు. ఈవీలు, బ్యాటరీ తయారీకి బలమైన సరఫరా-గొలుసు పర్యావరణ వ్యవస్థను నిర్మించడం నుండి ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, షిప్‌బిల్డింగ్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs)లో కొత్త అవకాశాల వరకు కీలక రంగాలలో ముఖ్య భూమిక పోషించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు జపాన్ రాయబారి.
AP-Japan Key Agreement
తనను కలుసు కోవడం మరింత ఆనందంగా ఉందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. జపాన్ ఫార్మా రాజధాని కోయామా నుండి ప్రేరణ పొందుతూ, ఫార్మాస్యూటికల్ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచడం గురించి కూడా తాము విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. వైజాగ్‌లో జరిగిన CII భాగస్వామ్య సదస్సులో 20 జపనీస్ కంపెనీలు మాతో చేరడం, ఆంధ్రప్రదేశ్‌పై బలమైన ఆసక్తిని వ్యక్తం చేయడం మరింత సంతోషం కలగించిందని చెప్పారు. జపాన్ ఖచ్చితత్వం, పరిపూర్ణత సంస్కృతి నిజంగా ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ఈ విశ్వసనీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని తాము ఎదురు చూస్తున్నామని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : CII Summit-Goenka Group Important Update : సీఎంతో గోయెంకా గ్రూప్ వైస్ చైర్మన్ భేటీ
















