CII Summit : విశాఖపట్నం : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ వేదికగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రతిష్టాత్మకమైన 30వ సీఐఐ (CII Summit) భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు నారా లోకేష్. భారతదేశం ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇంజన్ గా నిలుస్తున్న సమయంలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. పెట్టుబడులకు గమ్య స్థానంగా ఏపీని ఎందుకు ఎంచుకోవాలనే దానికి మూడు కారణాలు చెప్పారు. దార్శనిక నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ సొంతం అన్నారు.
CII Summit Updates
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు వికసిత భారత్ లో భాగంగా ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని ప్రకటించారు నారా లోకేష్. ఇవాళ దేశంలోనే ఏపీ టాప్ లో దూసుకు పోతోందని చెప్పారు. ఇప్పటి వరకు లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తమ రాష్ట్రానికి వచ్చాయని, ఇదంతా సమర్థవంతమైన నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండడం వల్లనే సాధ్యమైందని అన్నారు నారా లోకేష్. అన్ని రంగాలను బలోపేతం చేయడంపై ఎక్కువగా దృష్టి సారించామని స్పష్టం చేశారు.
Also Read : MDF Huge Manufacturing Unit : ఎండిఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్


















