CM Revanth : హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ లు పర్యటించనున్నారు. ఈసందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు సీఎస్ రామకృష్ణా రావు. ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి , 21 వ తేదీన రాష్ట్రపతి హైదరాబాద్ లో పర్యటించనున్నారు. విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకొని, ఆయా డిపార్ట్ మెంట్ల వారీగా నోడల్ ఆఫీసర్ ను నియమించి, నిబంధనల ప్రకారం తగు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
CM Revanth Reddy Focus
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 16న మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని, రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి న్యూఢిల్లీకి బయలు దేరుతారని పేర్కొన్నారు. రాష్ట్రపతి 21 తేదీన మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని రాజ్ భవన్ లో బస చేసి, అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు.
సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పొలిటికల్ కార్యదర్శి రఘునందన్ రావు, అదనపు డిజిపిలు విజయ్ కుమార్, మహేష్ భగవత్, GHMC కమీషనర్ ఆర్. వి. కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ Ch. ప్రియాంక, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, ప్రొటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : Minister Kandula Durgesh-Vizag Growth : వినోద రంగానికి కేరాఫ్ వైజాగ్ నగరం


















