SS Rajamouli : హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిక (SS Rajamouli) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన సినిమా గ్లోబ్ ట్రోటర్ కు సంబంధించి బిగ్ ఈవెంట్ ను ప్లాన్ చేశాడు. దీనిని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 50 వేల మందికి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంత వరకే తాము అనుమతి తీసుకున్నట్లు ఇప్పటికే వెల్లడించారు నిర్వాహకులు. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ కు సంబంధించి వీడియో సందేశం ద్వారా కీలక సూచనలు చేశారు దర్శకుడు జక్కన్న. ఈ మూవీలో నటించిన ప్రిన్స్ మహేష్ బాబు, నటి ప్రియాంక చోప్రాతో పాటు పెద్ద ఎత్తున తారాగణం రానుందని సమాచారం.
SS Rajamouli Comments
కాగా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కు వచ్చే అభిమానులు తాము చేసిన సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు దర్శకుడు రాజమౌళి. ఈ ఈవెంట్ కు 18 సంవత్సరాల లోపు వారికి, సీనియర్ సిటిజన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ అనేది ఓపెన్ ఈవెంట్ కాదని చెప్పారు. కేవలం ఫిజికల్ పాసులు ఉంటేనే రావాలని కోరారు. ఈవెంట్ రోజు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ మూసి వేస్తారని తెలిపారు. విజయవాడ, ఎల్బీనగర్, గచ్చిబౌలి రూట్ల నుండి వచ్చే వాళ్ల కోసం పాస్ మీద ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుందన్నారు. ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుండి తెరుస్తారని చెప్పారు దర్శకుడు. ఇదిలా ఉండగా తొలిసారిగా జియో హాట్ స్టార్ గ్లోబ్ ట్రోటర్ మూవీ ఈవెంట్ ను డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
Also Read : CM Chandrababu Interesting Comments : యూరోపియన్ యూనియన్ తో మెరుగైన బంధం

















