Samyuktha : యూపీలోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా కొనసాగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులంతా పుణ్య స్నానం చేసేందుకు క్యూ కడుతున్నారు. నిన్న ప్రధానమంత్రి మోడీ, మొన్న బాలీవుడ్ డైరెక్టర్ చక్ దే మూవీ ఫేం కబీర్ ఖాన్ కూడా గంగలో స్నానం చేశారు. నది పవిత్రమైనదని దీనికి కుల,మతాలతో సంబంధం ఏంటి అంటూ ప్రశ్నించారు.
Samyuktha Menon Viral at Maha Kumbh Mela
తాజాగా కేరళ కుట్టి , అందాల ముద్దుగుమ్మ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు మహా కుంభ మేళా. తను కూడా అలహాబాద్ లో త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం చేశారు. జలకాలటలు ఆడారు. పుణ్య స్నానం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందంటూ పేర్కొంది ఈ లవ్లీ బ్యూటీ. తను ఇప్పుడు పలు సినిమాలలో బిజీగా ఉంది.
తనకు భక్తి అంటే ఇష్టం. తన నటనా వృత్తికి మించి మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునేందుకు తాను ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ సందర్బంగా ఫ్యాన్స్ సంయుక్త మీనన్(Samyuktha) ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 14 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానం చేసినట్లు ఓ అంచనా.
Also Read : Bandla Ganesh Shocking :సింగనమల కామెంట్స్ బండ్ల సీరియస్