Hydraa : హైదరాబాద్ : గచ్చిబౌలిలోని ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలను హైకోర్టు తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్‌గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లేఔట్‌లో 162 వరకూ ప్లాట్లుండగా.. అందులోని మెజార్టీ ప్లాట్లు తనవనే ఉద్దేశంతో రహదారులు, పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. హైడ్రా (Hydraa) అందుకే ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది. ఒకసారి లే ఔట్ వేస్తే అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది. సంధ్యా శ్రీధర్ రావు రహదారుల ఆక్రమణలను ఇటీవల హైడ్రా తొలగించిన విషయం విధితమే. ఈ విషయమై సంధ్యా శ్రీధరరావు హైకోర్టును ఆశ్రయించారు.
High Court Shocking Hydraa
ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాధిత ప్లాట్ యజమానులు కూడా వారి గోడును హైకోర్టుకు విన్నవించుకున్నారు. లే ఔట్‌లో సరిహద్దులన్నీ చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారని సంధ్యా శ్రీధర్‌రావుపై ఫిర్యాదు చేశారు. ఎక్కువ ప్లాట్లు కొని.. తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని ప్రయత్నించారని పేర్కొన్నారు. ఎక్కువ ప్లాట్లు తనవే ఉన్నాయని.. లే ఔట్‌లోని రహదారులు, ఆ పక్కనే ఉన్న తమ ప్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించు కోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని తెలిపారు బాధితులు.
Also Read : TPCC Chief Mahesh Goud Shocking Update : నవీన్ యాదవ్ గెలుపొందడం ఖాయం


















