Dharmendra : ముంబై నట దిగ్గజం ధర్మేంద్ర బ్రతికే ఉన్నారని ఆయన కుమార్తె ఇషా డియోల్, భార్య సీనియర్ నటీమణి హేమ మాలిని ప్రకటించారు. మీడియా వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమాచారం తెలుసు కోకుండా ఎలా ప్రచురిస్తారని, ప్రసారం చేస్తారంటూ ప్రశ్నించారు. ధర్మేంద్ర చికిత్సకు సహకరిస్తున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఇంత ఘోరంగా చని పోయారంటూ ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు. ఇన్స్టా లో ఇషా డియోల్ మెసేజ్ పెట్టగా ఎక్స్ వేదికగా హేమమాలిని మెసేజెస్ పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు స్వంతంగా ధర్మేంద్ర బ్రతికే ఉన్నాడని స్పష్టం చేయడంతో జాతీయ మీడియా షాక్ కు గురైంది. మరో వైపు కుటుంబ ఆస్తుల వ్యవహారాల నేపథ్యంలోనే ధర్మేంద్ర (Dharmendra) మృతి చెందిన విషయం ప్రకటనపై జాప్యం చేస్తున్నారంటూ ఓ మీడియా ఆరోపిస్తోంది.
Actor Dharmendra
ఇదిలా ఉండగగా దర్మేంద్రకు ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని ఉన్నారు. బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తొలి భార్య సంతానం. ఐకానిక్ మూవీ ‘షోలే’లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, ఘాయల్, లోఫర్ తదితర పేరు పొందిన చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలు ధర్మేంద్రకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేశాయి. ప్రధానంగా షోలే మూవీ తనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకు వచ్చేలా చేసింది. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ స్వస్థలం. 1935 డిసెంబర్ 8న ఆయన పుట్టారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ రంగంలోకి వచ్చారు. యాక్షన్ కింగ్ గా పేరు పొందారు.
Also Read : Tirupati Strong Alert : ఢిల్లీ ఘటన ఎఫెక్ట్ తిరుపతిలో అలర్ట్

















