Athiya Shetty : ఎవరీ అతియా శెట్టి అనుకుంటున్నారా. తను అత్యంత జనాదరణ పొందిన భారత జట్టుకు చెందిన క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్య. అంతే కాదు బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరొందిన సునీల్ శెట్టి ముద్దుల గారాల పట్టి ఈ చిన్నది. ఈ మధ్యన తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ వస్తోంది. మరో వైపు కేఎల్ రాహుల్ తన కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు. త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు రెడీ అయ్యాడు.
Athiya Shetty Viral
ఈ తరుణంలో వీరిద్దరూ గత కొంత కాలంగా వివిధ ప్రదేశాలను సందర్శించారు. మరో వైపు ఆట పరంగా భర్త బిజీగా ఉండడంతో అతియా శెట్టి(Athiya Shetty) తన పేరెంట్స్ తో కలిసి టూర్ కొనసాగిస్తోంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం తను గర్భవతి అయినట్టు సమాచారం. కానీ ఇప్పటి వరకు దీనిని కన్ ఫర్మ్ చేయలేదు కేఎల్ రాహుల్ కానీ సునీల్ శెట్టి పేరెంట్స్ కానీ.
అయితే కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి ఉన్నాడు సునీల్ శెట్టి. తను సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి అగ్ర నటులతో పోటీ పడ్డాడు. ఏది ఏమైనా అతియా శెట్టి తన ప్రెగ్నెన్సీ గురించి నెటిజన్లు తెగ ముచ్చటించు కోవడం విశేషం. త్వరలోనే తీపి కబురు చెబుతారని ఆశిస్తున్నారంతా.
Also Read : Hero Mahesh-Priyanka : ప్రిన్స్ సరసన ప్రియాంకేనా