PM Modi : ఉత్తరప్రదేశ్ : భారత దేశ పునర్ నిర్మాణంలో రైళ్లు భాగం పంచుకుంటున్నాయని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi). శనివారం బనారస్ రైల్వే స్టేషన్ నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బనారస్-ఖజురహో, లక్నో-సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ , ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో నడుస్తాయి. సెమీ-హై-స్పీడ్ రైళ్లు ప్రధాన స్టేషన్ల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయన్నారు ప్రధానమంత్రి, ప్రాంతీయ చలనశీలతను పెంచుతాయని చెప్పారు. దీని కారణంగా పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు పీఎం. దేశ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తాయని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
PM Modi Inaugurates
బనారస్-ఖజురహో వందే భారత్ వారణాసి, ప్రయాగ్‌రాజ్- చిత్రకూట్‌తో సహా ప్రముఖ సాంస్కృతిక , మత పరమైన ప్రదేశాలను కలుపుతుందని అన్నారు. స్వదేశీ వస్తువుల తయారీపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు పీఎం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగానే వందే భారత్ రైళ్లు రావడం జరిగిందని చెప్పారు. ఇది ఒక మైలు రాయిగా ఆయన అభివర్ణించారు. తాము పాలనను చేతిలోకి తీసుకున్నాక రైల్వే శాఖలో కీలకమైన సంస్కరణలు తీసుకు వచ్చామని చెప్పారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ప్రధానంగా రైళ్ల కనెక్టివిటీతో పాటు పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు పీఎం. దీనిని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Also Read : President Murmu Important Visit : రాష్ట్రపతి తిరుమల పర్యటన ఏర్పాట్లపై సమీక్ష


















