Nara Lokesh : అమరావతి : ఏపీ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 175 శాసన సభ నియోజకవర్గాలలో 406 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు జాబ్ మేళా నిర్వహించడంపై ఫోకస్ పెట్టామన్నారు. జాబ్ మేళాల్లో మరిన్ని సంస్థలను భాగస్వాములను చేసి యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేలా చూడాలని కోరారని తెలిపారు. ప్రపంచంలోనే ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కంపెనీ ఏకంగా ఏఐ హబ్ ను విశాఖపట్నం వేదికగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నారా లోకేష్.
Minister Nara Lokesh key Update
గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా డిజిటల్, ఎఐ సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించడం జరిగిందన్నారు నారా లోకేష్. అధునాతన సాంకేతికతలపై ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని తాను స్పష్టం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఐటిఐ, పాలిటెక్నిక్ ల కరిక్యులమ్ లో మార్పులపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు నారా లోకేష్. ఏపీ కూటమి సర్కార్ విద్యా రంగంపై దృష్టి సారించిందన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డేటా ఆధారిత పాలనను అమలు చేస్తోందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపారు మంత్రి.
Also Read : YS Sharmila Shocking Comments in PM Modi : మోదీ చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మ


















