Minister Atchannaidu : అమరావతి : ఉల్లి రైతులను ఏపీ కూటమి సర్కార్ ఆదుకుంటుందని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). ఏఒక్క రైతు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కర్నూలు జిల్లాలో 15232 హెక్టార్లలో 23316 మంది రైతులకు 76.16 కోట్లు, కడప జిల్లాలో 5681 హెక్టార్లలో 6400 మంది రైతులకు 28.41 కోట్లు మొత్తంగా 20,913 హెక్టార్లలో 29,716 మంది రైతులకు రూ. 104.57 కోట్ల రూపాయల లబ్ధి పొంద బోతున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే డబ్బులను రైతులకు అంద చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హమీ ఇచ్చారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Minister Atchannaidu Key Update
ఉల్లి పంటకు సంబంధించిన సమస్యలను ఆయా జిల్లాలో ప్రత్యేకంగా మానిటర్ చేయడానికి ప్రక్రియ మొదలు పెట్టామని అన్నారు. వాతావరణ మార్పులు, అనుకోని మార్కెట్ పరిస్థితులు వచ్చినా కూడా ప్రభుత్వం రైతు పక్షానే నిలుస్తుందని అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) స్పష్టం చేశారు. ఉల్లి రైతులు ధైర్యంగా ఉండాలని, మీ సమస్యలు మా సమస్యలేనని పేర్కొన్నారు. పంటకు తగిన రక్షణ, సరైన ధర కల్పించేందుకు ప్రభుత్వం మీతో ఉంది అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
2020లో వైసీపీ ప్రభుత్వం ఉల్లి ధర పడి పోయినప్పుడు కేవలం క్వింటాలుకు రూ. 770 మద్దతు ధర ప్రకటించి రైతులు దగ్గర ఉల్లి కొనుగోలు చేయకుండా మోసం చేశారంటూ ఆరోపించారు. జగన్ హయాంలో మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 129 మంది రైతుల నుండి 970 మెట్రిక్ టన్నుల ఉల్లిని మాత్రమే కొనుగోలు చేశారని వాపోయారు. రైతులకు కేవలం రూ. 75 లక్షలు మాత్రమే చెల్లించారని ఆయన తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక నిర్ణయంతో క్వింటాకు రూ. 1200 పెట్టి మార్క్‌ఫెడ్ ద్వారా భారీగా కొనుగోలు జరిపించారని అన్నారు. కాగా అది కూడా రైతులకు సరిపోదని రూ. 50 వేలు సాయంగా ఇస్తున్నామని ప్రకటించారు అచ్చెన్నాయుడు.
Also Read : Perni Nani Fired on Nara Lokesh : నారా లోకేష్ కామెంట్స్ పేర్ని నాని సీరియస్


















