Kandula Durgesh : లండన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని అన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh). లండన్‌లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం) – 2025 ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై గర్వంగా ప్రదర్శించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ సందర్బంగా. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించే కూచిపూడి నృత్యంతో రాష్ట్ర పర్యాటక స్టాల్‌ను ఏర్పాటు చేయడం జీవితంలో మరిచి పోలేని అనుభూతిని మిగిల్చేలా చేసిందన్నారు.
Minister Kandula Durgesh Comments
ప్రపంచ వ్యాప్తంగా 20 కి పైగా టూర్ ఆపరేటర్లు, హోటల్ చైన్ ప్రతినిధులు, ఎంఐసీఈ ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ ట్రావెల్ మీడియా, బ్లాగర్లు, మేగజైన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగిందని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్బంగా ఏపీ టూరిజం పాలసీ 2024-2029 కి సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడుల విస్తృత అవకాశాలను సమగ్రంగా వివరించామని చెప్పారు.
ప్రపంచ పర్యాటకులకు ఆకర్షణీయమైన రాష్ట్ర సుందర తీరప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, వారసత్వ సంపద, సాంస్కృతిక కళారూపాలను ప్రచారం చేస్తూ, ఏపీలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని తెలియ చేశామన్నారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాన్ని ప్రపంచ పర్యాటక మ్యాప్‌పై సగర్వంగా నిలబెట్టి, రాష్ట్రానికి ఉపాధి, అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్.
Also Read : Thalapathy Vijay – TVK CM Interesting Update : టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్


















