Ponnam Prabhakar : హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమవారం బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది సర్కార్. ఈ విషయాన్ని వెల్లడించారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar), ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బస్సు ప్రమాదంపై మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, డీజీపీ, సీపీల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
Minister Ponnam Prabhakar Order
ఇదిలా ఉండగా ఘటనా స్థలాన్ని సందర్శించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రంజిత్ రెడ్డి. గతంలో స్టేట్ హైవే ఉంటే జాతీయ రహదారి చేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. భూసేకరణ పూర్తి చేసి టెండర్లు పిలిచామని తెలిపారు. కాగా ఇంతలోనే ఎన్నికలు రావడం వల్ల పనులు ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు సబితా ఇంద్రారెడ్డి. ఎన్నికలు జరిగి రెండేళ్లు అవుతున్నా ఇంకా పనులు పూర్తి కాలేదన్నారు. రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : DY CM Pawan Kalyan Important Update : ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్ సరస్సు


















