KTR : హైదరాబాద్ : తెలంగాణలో రాబోయేది గులాబీ సర్కార్ అని జోష్యం చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . తన సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు నవతా రెడ్డి. ఆమెతో పాటు పలువురు పార్టీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ చేరికలతో అందరికీ ఓ మెసేజ్ వెళుతుందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని తేలి పోయిందన్నారు. రెండేళ్లలో రాష్ట్రం ఎలా అయ్యిందో అందరూ ఆలోచించాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలన్నీ బంద్ అయ్యాయని పేర్కొన్నారు. కొత్త కార్యక్రమాలు లేకపోగా.. ఉన్నవి కూడా బంద్ పెట్టారంటూ మండిపడ్డారు. పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అని అందరూ చెబుతున్నారని పేర్కొన్నారు.
KTR Comments
500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని స్పష్టం చేశారు కేటీఆర్ (KTR). జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్ చని పోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చిందన్నారు. గోపినాథ్ సతీమణి సునీత బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగుతోందని చెప్పారు. కానీ ఒక మీటింగ్‌లో గోపీనాథ్‌ను తలుచుకొని సునీత కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా కాంగ్రెస్ విమర్శించడం, రాజకీయం చేయడం దారుణమన్నారు. ఒక ఆడబిడ్డకు ఆమె భర్త చనిపోతే ఏడుపు రాదా అని ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ నేతల ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్లు ఏడ్వరా అని నిలదీశారు. చనిపోయిన వారిని తలుచుకొని ఏడిస్తే కూడా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Also Read : Hydraa Commissioner Important Update : నల్ల చెరువు కూకట్‌పల్లికి మణిహారం
















