K Kavitha : కరీంనగర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K Kavitha) దూకుడు పెంచారు. ఆమె ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నిజామాబాద్ జిల్లా నుంచి జాగృతి జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఉద్దండాపూర్ రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం బీసీ సంక్షేమ హాస్టల్ లో చదువుకుంటూ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీహర్షిత కుటుంబాన్ని వంగర గ్రామంలో సందర్శించారు. బిడ్డను కోల్పోయిన తల్లికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పట్టణంలో పేరు పొందిన మైసమ్మ ఆలయంలో పూజలు చేశారు. పంటలను కోల్పోయిన రైతులతో నేరుగా మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
K Kavitha Strong Demand
ఈ సందర్బంగా రూ. 10 వేలు ఇస్తే సరిపోదని, ప్రతి ఒక్క రైతుకు రూ. 50 వేలు పరిహారంగా ఇవ్వాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అనంతరం కరీంనగర్‌కు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులను కలుసుకున్నారు. వారు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆ కళారూపాలను చూసి విస్తు పోయారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చేతి వృత్తి కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. 2,000 సంవత్సరాల పురాతనమైన ఈ కళారూపం తెలంగాణ సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించడమే కాకుండా, దానిని అసమానమైన నైపుణ్యం , అభిరుచితో సంరక్షిస్తున్న దాదాపు 150 కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
Also Read : Minister Ponnam Prabhakar Fired on KTR : కేటీఆర్ పై కేసు నమోదు చేయాలి : పొన్నం ప్రభాకర్

















