Kandula Durgesh : విశాఖపట్నం – అంతర్జాతీయ క్రూయిజ్ టర్నినల్ ఓ మైలురాయి విశాఖలో కానుందన్నారు మంత్రి కందుల దుర్గేష్. వర్చువల్ గా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తో కలిసి కార్డేలియా సముద్ర విహార నౌకను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేసినందుకు విశాఖ పోర్టు అథారిటీని ప్రశంసిచారు. యోగాంధ్ర వేడుకల విజయంలో కీలక పాత్ర పోషించిన వైజాగ్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కు అభినందించారు.
Minister Kandula Durgesh Key Comments on Tourism Growth
అలలపై ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించే విలాసవంతమైన సముద్ర విహార నౌకను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) అన్నారు. ఈ సందర్భంగా నౌకలో కల్పించిన వసతులను, పర్యాటకులకు అందించే సౌకర్యాలను, ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీటీడీసీ ఏర్పాటు చేసిన పర్యాటక స్టాళ్లను మంత్రి దుర్గేష్ సందర్శించారు. అనంతరం టెర్మినల్ బిల్డింగ్, స్పెషల్ లాంజ్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్స్ తదితర అంశాలను పరిశీలించారు.
ఇంత గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే పోర్టు కార్యకలాపాల్లో అగ్రగామిగా ఉన్న విశాఖపట్నం ఇకపై క్రూయిజ్ పర్యాటకులకూ సేవలందించనుందన్నారు. విశాఖపట్నం ప్రకృతి సహజ సిద్ధ అందాలు, సుదీర్ఘ సముద్రతీరం, అందమైన సినీ లొకేషన్లు, చారిత్రక కట్టడాలు తదితర అందాలకు నెలవన్నారు. ఈ క్రమంలో టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేసి విశాఖను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. క్రూయిజ్ టూరిజం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామన్నారు. 2047 నాటికి ఏపీని ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు.
Also Read : Popular Journalist Krishnam Raju : సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు విడుదల
















