Minister Komatireddy : హైదరాబాద్ : మొంథా తుపాను ప్రభావం ఇరు తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేస్తోంది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలన్నీ నీటి పాలయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణలో రహదారులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ సందర్బంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) గురువారం సమీక్ష చేపట్టారు. కీలక సూచనలు చేశారు ఉన్నతాధికారులకు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు హై అలర్ట్‌లో ఉండాలని స్పష్టం చేశారు మంత్రి. ఈఎన్సీలు, సీఎస్‌లు, ఎస్‌ఈలతో సమీక్షించి క్షేత్ర స్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలందరూ అత్యవసరం అయితేనే రోడ్లపైకి రావాలని కోరారు .
Minister Komatireddy Key Comments
ప్రతి అధికారి ఫీల్డ్ లెవెల్‌లో క్లోజ్ మానిటరింగ్ చేయాలని అత్యవసరం అయితే తప్ప సెలవులకు వెళ్లవద్దని పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. లోకాజ్‌వేలు, కల్వర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు మంత్రి. ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ ద్వారా అన్ని జిల్లాలతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మాన్సూన్ సమయంలో తమ ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో చేసిన మేల్కొలుపు చర్యలు అభినందనీయం అని ప్రశంసించారు. అదే స్పూర్తిని ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొనసాగించాలని స్పష్టం చేశారు.
Also Read : K Kavitha Fired on Congress Govt : గోదావరి జలాల ఎత్తిపోతలపై మౌనమేల..?
















