K Kavitha : పాలమూరు జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K Kavitha) తెలంగాణ సర్కార్ ను ఏకి పారేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా నేటికి ఒక్క ప్రాజెక్టు అడుగు ముందుకు వేయలేదన్నారు. సముద్రంలోకి గోదావరి జలాలు వృథాగా పోతున్నా పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు గేట్లు ఎత్తి వేల టీఎంసీల నీరు నదిలోకి విడిచారని, దీని వల్ల నష్టం తప్ప లాభం ఏమీ లేదన్నారు కవిత. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తక్కువ ఖర్చుతో మల్లన్నసాగర్ నింపుకునే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం సర్కార్ చేయడం లేదని మండిపడ్డారు. మిడ్ మానేరు నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్ మీదుగా ఎత్తిపోతలపై ఎందుకు నోరు విప్పడం లేదంటూ ప్రశ్నించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.
K Kavitha Slams Congress Govt
భారీ వర్షాల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో మల్లన్న సాగర్ కు నీటిని ఎత్తిపోసుకునే చాన్స్ ఉందన్నారు కవిత. ఇప్పుడు తప్పితే తర్వాతి రోజుల్లో ఎక్కువ ఖర్చుతో ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్ మానేరుకు, అక్కడి నుంచి మల్లన్నసాగర్ కు ఎత్తి పోయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా నడుచుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలపై పెనుభారం మోపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో 100 పడకలు ఉన్న జడ్చర్ల ఆసుపత్రి 50 పడకల అయ్యిందన్నారు. ఉన్న ఆసుపత్రులను కూడా నడప లేని దుస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో అంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే కృష్ణా నది నుండి మహబూబ్ నగర్ జిల్లాకు చుక్క నీరు కూడా రాదన్నారు.
Also Read : KTR Fired on Congress Govt : దిగజారిన ప్రతిష్ట కాంగ్రెస్ సర్కార్ అవస్థ
















