KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులు వాటాల కోసం కొట్లాడుకునే పరిస్థితి దాపురించిందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యాడని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ హోటల్స్ కార్మిక యూనియన్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. హోటల్ కార్మికులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రెండేళ్లకే కాంగ్రెస్ సర్కార్ పై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కార్మిక నేతలకు మద్దతు ఇస్తామన్నారు. రాబోయే రోజులలో మీ తరపున పోరాడేందుకు సిద్దంగా ఉన్నామన్నారు కేటీఆర్.
KTR Shocking Comments on Congress Govt
హోటల్‌లో పనిచేసే కార్మికులు బ్రతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారని , వారికి భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో హోటల్ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించ లేదన్నారు. మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారని పోలీసులు ఇంటికి వెళ్లారని, ఇక కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ బయటకు వచ్చి అసలు బండారం బయట పెట్టిందన్నారు. ఏకంగా రేవంత్ రెడ్డినే రోహిన్ రెడ్డికి గన్ ఇచ్చాడని ఆరోపించారని అన్నారు. అంతే కాదు ఎలాంటి పదవులు లేక పోయినా రేవంత్ సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు ఎలా గన్ మెన్లు ఇచ్చారంటూ నిలదీశారని అయినా సీఎంకు సిగ్గు రావడం లేదన్నారు.
Also Read : Jajula Srinivas Goud Shocking Comments : తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం

















