K Kavitha : నిజామాబాద్ జిల్లా : రైతులను పట్టించు కోవాల్సిన సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (K Kavitha). ఆదివారం జాగృతి జనం బాటలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను పరామర్శించారు. ఫారెస్ట్ అధికారులు పంట ధ్వంసం చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసిన రైతు రామావత్ ప్రకాశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రైతులకు పట్టాలు ఇచ్చే వరకు వారి తరఫున పోరాడుతాం అన్నారు. ఆత్మహత్యల ఆలోచనలు వద్దంటూ రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడారు.
K Kavitha Slams Congress Govt
తెలంగాణ వచ్చాక మంచిప్ప ప్రాజెక్ట్ పెద్దగా చేసుకోవాలని ప్రయత్నించామని, కానీ దానిని చేసుకోలేక పోయామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడకు ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టను అని చెప్పారని అన్నారు . అలాంటప్పుడు రైతులకు ఈ భూములను పట్టా చేయాలి. ఇవాళ కాకపోతే రేపైనా రైతులకు పట్టా చేయిస్తామన్నారు . ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దని నేను ప్రభుత్వాన్ని, ఇక్కడి మంత్రులను, జిల్లా కలెక్టర్ ను కోరుతున్నానని అన్నారు కవిత.
అదే విధంగా ఇక్కడి 9 తండాలు, 3 గ్రామ పంచాయితీలకు పట్టాలు వచ్చే అవకాశం ఉందన్నారు. వాటిని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగతా పట్టా ల్యాండ్ ల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించ వద్దని కోరారు. చేతికొచ్చిన పంటపై విషం చల్లటమంటే ఎంత దారుణం అని ప్రశ్నించారు. ఇంత నిరంకుశంగా, కర్కషంగా ప్రభుత్వాలు ఉండటం కరెక్ట్ కాదన్నారు.
Also Read : YS Sharmila Fired on AP Govt : మన్యంలో మరణ మృదంగంపై మౌనమేల..?















