Jajula Srinivas Goud : హైదరాబాద్ : బీసీలను ఉద్దేశించి రౌడీలంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). ఆదివారం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. బీసీలను అవమానిస్తున్న బిఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు . ఇంకోసారి బీసీలను రౌడీలు అంటే అగ్రకుల నాయకులకు బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీలను అవమానించడం టిఆర్ఎస్ కు అలవాటుగా మారిందన్నారు. ఇవాళ ఆ పార్టీపై 15 బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jajula Srinivas Goud Slams KCR
నాటి ప్రొఫెసర్ జయశంకర్ నుండి మొదలుకుంటే నేటి నవీన్ యాదవ్ వరకు బీఆర్ఎస్ పార్టీ అహంకారం, ఆధిపత్యంతో అవమానిస్తున్నదని మండిపడ్డారు జాజుల శ్రీనివాస్ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉన్నత విద్యావంతుడు , బిసి సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీకి టికెట్ కేటాయించిందని అనడాన్ని బీసీ సంఘాలుగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇదే కుల , అధికార అహంకారంతో గత 10 ఏళ్లుగా విర్రవీగి నందుకే ప్రజలు తనను ఓడించారని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్.
Also Read : PM Modi Important Comments : గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీమ్
















