Minister Anagani : అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Minister Anagani). గురువారం మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యం తయారీకి జగన్ కారకుడని ఆరోపించారు. రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం నిజం కాగా అని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారీపై కంపెనీని కామెరూన్ ప్రభుత్వ మంత్రి సీజ్ చేసింది వాస్తవం కాదా అని నిప్పులు చెరిగారు. వైఎస్ సునీల్‌రెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి జగన్ బినామీలు కాదా ఆ విషయం ప్రజలకు అంతా తెలుసున్నారు. ప్రతాప్, కాకాణిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో జగన్ చెప్పాలన్నారు అనగాని సత్య ప్రసాద్.
Minister Anagani Satyaprasad Slams YS Jagan
ఇదిలా ఉండగా మద్యం తయారీకి సంబంధించి జయ చంద్రారెడ్డి, సురేంద్ర నాయుడుని టీడీపీ నుంచి తమ పార్టీ చీఫ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారని, ఎక్కడా ఎవరి పట్ల దయ చూపించ లేదన్నారు మంత్రి. సస్పెండ్ చేసి కేసులు కూడా పెట్టామన్నారు . కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమిదేనని పేర్కొన్నారు. కల్తీ మద్యం తయారీ కారణంగా జగన్ రెడ్డి ,వైసీపీ ఐదేళ్ల పాలనా కాలంలో 30 వేల మందికి పైగా కల్తీ మద్యాన్ని సేవించి ప్రాణాలు కోల్పోయారని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి అనగాని సత్య ప్రసాద్. అంతే కాకుండా రూ. 3,000 కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు.
Also Read : CM Chandrababu Strong Focus on Dubai Rains : భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా
















