CM Chandrababu : మంగళగిరి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు ఎవరైనా విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించారు. ఎవరైనా సరే, ఏ స్థానంలో ఉన్నా సరే వారిని కట్టడి చేయాలని, వీలైతే అదుపులోకి తీసుకోవాలని అన్నారు సీఎం. మంగళవారం చంద్రబాబు (CM Chandrababu) మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలను పసిగట్టాలని అన్నారు. అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణం అంశంపై మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూశారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టి వేరే వాళ్లపై నెపం వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపించారు.
CM Chandrababu Key Comments
పోలీసు వ్యవస్థ సమర్థంగా ఉండాలని స్పష్టం చేశారు. నేరస్థులు భయపడేలా పని చేయాలని కుండ బద్దలు కొట్టారు. గూగుల్ పెట్టుబడులు విశాఖకు వచ్చాయంటే అది ఒక నమ్మకం అని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. అతిపెద్ద పెట్టుబడులు వస్తున్నాయంటే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నామని పేర్కొన్నారు. ఈగల్, శక్తి బృందాలతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. డ్రగ్స్, గంజాయి స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. నేర రహిత సమాజం కోసం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం.
Also Read : Hero Chiranjeevi-Diwali Celebrations : టాలీవుడ్ స్టార్స్ దీపావళి జోష్

















