MP Raghunandan Rao : హైదరాబాద్ : మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) తమ లోక్ సభ నియోజకవర్గంలోని దుబ్బాక ఆర్టీసీ డిపోను పునరుద్దరించాలని కోరారు. ఈమేరకు ఆయన మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కలిశారు. వినతిపత్రం సమర్పించారు. తక్షణమే పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని కోరారు. ఎండీని కలిసిన అనంతరం రఘునంద్ రావు మీడియాతో మాట్లాడారు. 1996 సెప్టెంబర్ 9న ప్రజల విరాళాలతో సుమారు 5 ఎకరాల స్థలాన్ని బస్ డిపో కోసం కేటాయించారని చెప్పారు. 1998 ఆగస్టు 26న 54 బస్సులతో డిపో ప్రారంభమైందని తెలిపారు. ప్రారంభం నుండి దుబ్బాక డిపో అత్యుత్తమ సేవలు అందిస్తూ వచ్చిందన్నారు. ఇందులో 137 మంది సిబ్బంది ప్రతిరోజు 14,014 కి.మీ. ప్రయాణం చేసి, రూ.8 లక్షల దినసరి ఆదాయం సాధిస్తున్నారని వివరించారు.
MP Raghunandan Rao Request
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌టీసీ నష్టాల కారణంగా 2006 డిసెంబర్ 31న డిపో మూసి వేయబడినప్పటికీ, ప్రజలు,, ప్రజా ప్రతినిధుల నిరసనలతో వారం రోజుల్లోనే 10 బస్సులతో పునఃప్రారంభమైందని చెప్పారు ఎంపీ రఘునందన్ రావు. ప్రస్తుతం బస్సుల సంఖ్య 35కి పెరిగి, రాష్ట్ర స్థాయిలో ఆదాయ పరంగా ముందున్న డిపోలలో దుబ్బాక డిపో ఒకటిగా నిలుస్తోందని అన్నారు. ఇటీవల 2025 రాఖీ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రంలో 8వ స్థానం, ఉమ్మడి జిల్లాలో 2వ స్థానం సాధించిందని చెప్పారు. దుబ్బాక డిపో నుంచి నిజామాబాద్, శ్రీశైలం, కరీంనగర్, వేములవాడ, ముస్తాబాద్, రామాయంపేట, దౌల్తాబాద్, చేగుంట, దొమ్మాట, యాదగిరిగుట్ట వంటి రూట్లలో కొత్త సర్వీసులు ప్రారంభించాల్సిందిగా ఎంపీ రఘునందన్ రావు కోరారు. అలాగే, దుబ్బాక బస్ డిపోకు కొత్త డిపో మేనేజర్‌ను నియమించి, 60 బస్సులతో పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read : Pawan Kalyan Interesting Update : రైతులకే తిరిగి రిజిస్ట్రేషన్ మాట నిలబెట్టుకున్న పవన్


















