Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) నిప్పులు చెరిగారు. యావత్ తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తోందని అన్నారు. సోమవారం జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు హరీశ్ రావు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక అని, యావత్ తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని హామిలు ఇచ్చారని, . బాండ్ పేపర్లు రాసి ఇచ్చారని అది మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. వంద రోజలు కాదు, 700 రోజులు దాటినా అమలు చేయడం లేదని మండిపడ్డారు. అందుకే రేవంత్ రెడ్డికి జుబ్లిహిల్స్ ఎన్నికల్లో సురుకు తగలాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు హరీశ్ రావు.
MLA Harish Rao Shocking Comments
కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనువిప్పు కలుగుతుందని స్పష్టం చేశారు. లేకుంటే ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా, హామీలు అమలు చేయక పోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటు వేస్తారనే భ్రమలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు రావాలన్నా, పింఛన్లు, పథకాలు అమలు కావాలన్నా, హైడ్రా ఆగాలన్నా బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్నారు. మాగంటి సునీతకు బ్రహ్మరథం పట్టాలని పిలుపునిచ్చారు హరీశ్ రావు. రెండేళ్లలో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేశాడని ఆరోపించారు.
కేసీఆర్ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దితే, అత్యంత అవినీతి రాష్ట్రంగా తయారు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Amit Shah New Innovation : కొత్త క్రిమినల్ చట్టాలతో సత్వర న్యాయం
















