Devi Sri Prasad : మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ పై భగ్గుమన్న సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్

ఇంతకీ ఏమైందంటే..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనే కాదు లైవ్ మ్యూజిక్ ఉందంటే చాలు ఏ తరం వారైనా పరిగెత్తుతారు...

Hello Telugu - Devi Sri Prasad

Devi Sri Prasad : టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad). ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాతో పాటు తండేల్, కుబేర, కంగువ, ఉస్తాద్ భగత్ సింగ్, RC17 వంటి పెద్ద చిత్రాలకు మ్యూజిక్ చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఆయన గచ్చిబౌలిలో స్టేడియంలో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కాన్సర్ట్‌తో ఫ్యాన్స్ అసలు సాటిస్ఫై కావడం పక్కన పెడితే ఎక్స్‌ట్రీమ్ డిసప్పాయింట్ చెందారు. మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం వేసినట్లు చిటపటలాడుతున్నారు.

Devi Sri Prasad…

ఇంతకీ ఏమైందంటే..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనే కాదు లైవ్ మ్యూజిక్ ఉందంటే చాలు ఏ తరం వారైనా పరిగెత్తుతారు. అలాంటిది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ షోస్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తాజాగా ఇందుకు భిన్నంగా దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) కాన్సర్ట్ ప్లాప్ అయ్యింది. ఒకవైపు ఈ ఈవెంట్‌కి సీట్స్ బుక్ చేసుకొనే అభిమానులే కరువయ్యారు. అయినా దేవి.. సీఎంతో పాటు టాప్ సెలబ్రిటీలను ఆహ్వానించారు. ఏదిఏమైనప్పటికీ షోకి వెళ్లిన అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ” మ్యూజిక్ అసలు బాగాలేదని, దేవి లిరిక్స్ కూడా మర్చిపోయి మధ్యలో ఏదేదో యాడ్ చేశాడు. సౌండ్ సిస్టమ్ నిర్వహణ కూడా బాగాలేదని” ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో దేవిని ట్రోల్ చేస్తూ.. ఎంతైనా రెహ్మాన్, అనిరుధ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ల రేంజే వేరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక మహేష్ బాబు ఫ్యాన్స్.. ఈవెంట్‌లో ఒక్క మహేష్ బాబు సాంగ్ కూడా పాడకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచినా అనేక ఆల్బమ్స్‌కి దేవి మ్యూజిక్ అందించాడు. అయినా ఒక్క సాంగ్ కూడా ఎందుకు పాడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ‘1 నేనొక్కడే’ సినిమాలో ‘హూ ఆర్ యూ’ సాంగ్ లో మహేష్ రాక్ స్టార్‌గా అదరగొడుతారు. ఈ సాంగ్‌ని దేవి పాడితే స్టేజ్ వేరే లెవెల్ లో ఉండేది. కానీ.. ఆయన ఆ సాంగ్ పాడలేదు. దీంతో ఆగ్రహానికి గురవుతున్న బాబు ఫ్యాన్స్ దేవి.. మెగా ఫ్యాన్ అంటూ ముద్రేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు.

Also Read : Satya Krishnan : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న నటి సత్య కృష్ణన్ కూతురు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com