Gold : దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎగబాకుతూ కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ తాజా వివరాల ప్రకారం, 24 క్యారెట్ బంగారం (Gold) 10 గ్రాముల ధర రూ.1,25,080కు చేరగా, 22 క్యారెట్ ఆభరణాల బంగారం రూ.1,14,650గా నమోదైంది. అలాగే, 18 క్యారెట్ బంగారం ధర రూ.93,810కు చేరింది. వెండి కూడా అదే తరహాలో పెరిగి కిలోకు రూ.1,80,000 వద్ద స్థిరపడింది. ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.45,420గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన 100 శాతం సుంకాలు, సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై పరిమితులు వంటి నిర్ణయాలు గ్లోబల్ వాణిజ్యాన్ని ప్రభావితం చేశాయి. దీని ఫలితంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంలోకి మళ్లి పెట్టుబడులు పెట్టడంతో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రభావం భారత్ సహా ఆసియా మార్కెట్లపై కూడా తీవ్రంగా పడింది.
Gold – ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలు (10 గ్రాములు):
- చెన్నై: ₹1,25,460 (24K), ₹1,15,000 (22K), ₹95,000 (18K)
- ముంబై: ₹1,25,080 (24K), ₹1,14,650 (22K), ₹93,810 (18K)
- ఢిల్లీ: ₹1,25,230 (24K), ₹1,14,800 (22K), ₹93,960 (18K)
- కోల్‌కతా: ₹1,25,080 (24K), ₹1,14,650 (22K), ₹93,810 (18K)
- బెంగళూరు: ₹1,25,080 (24K), ₹1,14,650 (22K), ₹93,810 (18K)
- హైదరాబాద్: ₹1,25,080 (24K), ₹1,14,650 (22K), ₹93,810 (18K)
- కేరళ: ₹1,25,080 (24K), ₹1,14,650 (22K), ₹93,810 (18K)
- పూణే: ₹1,25,080 (24K), ₹1,14,650 (22K), ₹93,810 (18K)
- వడోదర: ₹1,25,130 (24K), ₹1,14,700 (22K), ₹93,860 (18K)
- అహ్మదాబాద్: ₹1,25,130 (24K), ₹1,14,700 (22K), ₹93,860 (18K)
ప్రధాన నగరాల వారీగా వెండి ధరలు (కిలోకు):
- చెన్నై: ₹1,90,000
- ముంబై: ₹1,80,000
- ఢిల్లీ: ₹1,80,000
- కోల్‌కతా: ₹1,80,000
- బెంగళూరు: ₹1,82,300
- హైదరాబాద్: ₹1,90,000
- కేరళ: ₹1,90,000
- పూణే: ₹1,80,000
- వడోదర: ₹1,80,000
- అహ్మదాబాద్: ₹1,80,000
బంగారం ధరలు ఇలాగే కొనసాగితే, రాబోయే పండుగ సీజన్‌లో ఆభరణాల కొనుగోళ్లు వినియోగదారులకు భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Gold Price Growth : పసిడి పరుగులు కొనసాగుతున్నాయి – వెండి కూడా రికార్డు స్థాయిలో పెరుగుదల



















