Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తనకు పాలించడం చేత కావడం లేదన్నారు. శనివారం హరీశ్ రావు (Harish Rao) మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలలో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ఆయన ప్రధానంగా ప్రాజెక్టులపై ప్రస్తావించారు. తనంతకు తానుగా రేవంత్ రెడ్డి నల్లమల పులి అని అనుకుంటున్నాడని, అక్కడికి పోయి ఉంటే తెలుస్తుంది ఎవరు పులినో ఇంకెవరు పిల్లి అనేదన్నారు. మొన్న ఖర్గేను పరామర్శించడానికి రేవంత్ రెడ్డి కర్ణాటక వెళ్లినప్పుడు, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు గురించి సిద్ధరామయ్య, శివ కుమార్ దగ్గర మాట్లాడుతాడు అనుకున్నానని చెప్పారు హరీశ్ రావు. తమ పార్టీకి చెందిన ప్రభుత్వమైనా ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించారు.
MLA Harish Rao Slams CM Revanth Reddy
ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుతుందన్న కనీస బుద్ధి రేవంత్ రెడ్డికి లేకుండా పోయిందన్నారు. రాహుల్ గాంధీతో కర్ణాటక సర్కార్ కి ఒక ఫోన్ కూడా చేపించలేక పోతున్నాడని, అంతగా దిగజారి పోయాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒక్కటే పని కాదని, .తెలంగాణ బాగోగుల గురించి కూడా పట్టించు కోవాలని హితవు పలికారు తన్నీరు హరీశ్ రావు. ఏపీ 463 టీఎంసీల నీళ్లు మళ్లిస్తే తాను పైన ఉంటూ 112 టీఎంసీలు ఆపుకుంటా అని కర్ణాటక అంటోందన్నారు. మరో వైపు తాను కూడా 74 టీఎంసీలు ఆపుకుంటా అంటూ మహారాష్ట్ర చెబుతోందన్నారు.
Also Read : Konda Murali Fired on Ponguleti : పొంగులేటి జోక్యం కొండా మురళి ఆగ్రహం


















