Jayam Ravi : డేటింగ్ వార్తలపై స్పందించిన సింగర్

తన గురించి వస్తున్న రూమర్స్ అన్ని వాస్తవం కాదని....

Hello Telugu - Jayam Ravi

Jayam Ravi : ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపూల్స్ విడాకుల ప్రకటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదివరకే ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ డివోర్స్ అనౌన్స్మెంట్‏తో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ఇప్పుడు మరో జంట తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. తమిళ్ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జయం రవి(Jayam Ravi).. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే తన అనుమతి లేకుండానే విడాకులు ప్రకటించారని.. తన భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరడం లేదంటూ నెట్టింట ఆవేదన వ్యక్తం చేసింది ఆర్తి. అయితే జయం రవి, ఆర్తి విడిపోవడానికి ఓ సింగర్ కారణమని.. కొన్నాళ్లుగా ఆమెతో జయం రవి రిలేషన్ షిప్‏లో ఉన్నాడంటూ రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా ఆమెతో జయం రవి కలిసి ఉన్న ఫోటోస్ కూడా వైరలయ్యాయి. అయితే తన గురించి వస్తున్న రూమర్స్ పై ఇప్పటికే జయం రవి స్పందించారు.

Jayam Ravi…

తన గురించి వస్తున్న రూమర్స్ అన్ని వాస్తవం కాదని.. తన పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ గానే చూడాలని.. అందులోకి మరొకరి తీసుకురావద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. అన్ని ఆధారాలతోనే తాను కోర్టులో పరిష్కారం కోరుతున్నానని అన్నారు. తాజాగా తన గురించి వచ్చిన వార్తలపై సింగర్ కెనీషా(Keneeshaa) తొలిసారి రియాక్ట్ అయ్యింది. తాను ఈ విషయం గురించి పై ఏ మీడియాతోనూ మాట్లాడనని తెలిపింది. ఇతరుల సమస్యలను మీవిగా చేసుకోవడానికి స్వే్చ్చను తీసుకున్న అందరికీ తాను ఒక వినయపూర్వకంగా అభ్యర్థనను చేస్తున్నట్లు తెలిపింది. “ ముందుగా వినయపూర్వకంగా మీకు చెబుతున్నాను. దీనికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ ఇంటి సమస్య కాదు.. మరొకరిది.. మీరు ఈ విషయంలో ఒక అభిప్రాయానికి రావడానికి అర్హులు కాదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకే ప్రతిఒక్కరూ దయగా ఉండాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను.. ఈ విషయం పై నేను ఏ ఇతర మీడియాతో మాట్లాడను” అంటూ కెనీషా తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.

అయితే కెనీషా(Keneeshaa) తన ఇన్ స్టాలో చేసిన పోస్టుపై నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ జయం రవి మీ దగ్గర క్షేమంగా ఉన్నారా ? అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా కెనీషా సీరియస్ అయ్యింది. మీరు మీ తల్లిదండ్రులతో సురక్షితంగా ఉన్నారు.. ? మీరు మీతో.. మీ అభద్రలతో సురక్షితంగా ఉన్నారు.. ? మీ చుట్టూ ఉన్న స్నేహితులందరితో సురక్షితంగా ఉన్నారా..? మీరు మొదటి స్థానంలో ఇతరులకు సురక్షితమైన వ్యక్తిగా ఉన్నారా? నేను మీకు శాంతి, ప్రేమను కోరుకుంటున్నాను అంటూ రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉంటే.. మరోవైపు జయం రవి తన భార్య ఆర్తి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో ఉన్న వస్తువులను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో కోరాడు జయం రవి.

Also Read : Sobhita Dhulipala : చై శోభిత ఎంగేజ్మెంట్ పై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన శోభిత

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com