Sanju Samson : హైదరాబాద్ : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పై (Sanju Samson) మరోసారి వివక్ష ప్రదర్శించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఆస్ట్రేలియాలో పర్యటించే భారత పురుషుల జట్టుకు సంబంధించి వన్డే ఫార్మాట్, టి20, టెస్టు ఫార్మాట్ లకు సంబంధించి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రకటించాడు. ఈ మేరకు కీలక ప్రకటన వెలువరించింది క్రీడా సంస్థ. ఇటీవల దుబాయ్ లో జరగిన ఆసియా కప్ 2025 మెగా టోర్నీలో పాల్గొన్న జట్టులో భాగం పంచుకున్నాడు. జట్టు పరంగా మొత్తం టర్నీలో 7 మ్యాచ్ లు ఆడింది. ఛాంపియన్ గా నిలిచింది. ఇక శాంసన్ ను ఓపనర్ గా కాకుండా వేరే ప్లేస్ లో పంపించడంతో ఆశించిన మేర తనకు ఆడే ఛాన్స్ రాకుండా పోయింది.
Sanju Samson Match Updates
ఇక పాకిస్తాన్ తో జరిగిన కీలక ఫైనల్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లు తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాట పట్టిన క్లిష్ట సమయంలో తను తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. 4వ వికెట్ కు ఈ ఇద్దరూ కలిసి 54 కీలక పరుగులు చేశారు. గత కొంత కాలంగా తన పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శిస్తూ వస్తోంది బీసీసీఐ. టెస్టు జట్టుకు దూరం పెట్టారు. ఇక వన్డే ఫార్మాట్ లో తనను పరిగణలోకి తీసుకోలేదు. ఒక్క టి20 ఫార్మాట్ కే ప్రయారిటీ ఇచ్చారు. ఇందులో తనను ఆఖరున చేర్చారు. తన స్థానంలో జితేశ్ శర్మకు ప్రయారిటీ ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఓడీఐకి ఎంపిక చేయక పోవడం పూర్తిగా తప్పు పడుతున్నారు అజిత్ అగార్కర్ ను.
Also Read : Beauty Rashmika – Rahul : రష్మిక మందన్నా అద్బుతమైన నటి : రవీంద్రన్



















