Minister Anitha : అమరావతి : ఈ దేశంలో అత్యున్నతమైన గౌరవం కలిగిన ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha). రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో పెద్ద ఎత్తున టీచర్లుగా ఎంపికయ్యారు పలువురు. ఈ సందర్బంగా మంత్రి పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో మెగా డీఎస్సీకి ఎంపికైన టీచర్లను ప్రత్యేకంగా సన్మానించారు. వారికి దిశా నిర్దేశం చేశారు. తాను కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తాను ఒకప్పుడు టీచర్ నేనని ఈ సందర్భంగా అనిత గుర్తు చేశారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని అన్నారు. మానవ జీవన ప్రయాణంలో టీచర్ల పాత్ర విస్మరించ లేనిదన్నారు. తమ సర్కార్ వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ చేపట్టామన్నారు.
Home Minister Anitha Comments
ఎక్కడా ఎలాంటి పొరపాటు అన్నది లేకుండా పరీక్ష నిర్వహించామని, సకాలంలోనే ఫలితాలు వెల్లడించామని, ఆ వెంటనే నియామక పత్రాలు కూడా అందజేశామన్నారు. ఎంతో కష్టపడి టీచర్లుగా ఎంపికైన మీరు ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి దాగి ఉంటుందన్నారు వంగలపూడి అనిత. సీబీఎన్ అంటే డీఎస్సీ.. డీఎస్సీ అంటే సీబీఎన్ అని అన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత టీచర్లదేనని స్పష్టం చేశారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాకారం కోసం ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత. గత జగన్ రెడ్డి సర్కార్ డీఎస్సీ పేరుతో కాలయాపన చేసిందన్నారు. నిరుద్యోగులను నిండా ముంచిన ఘనత మాజీ సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
Also Read : Hero Akshay Kumar : సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించాలి


















