Kanaka Durga : విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రి వేలాది మంది భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీ కనకదుర్గమ్మ (Kanaka Durga) దసరా నవరాత్రి ఉత్సవాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగుతున్నాయి. భవానీలు పోటెత్తారు. ఆలయ కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాలు ఈనెల 22న ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు 35 లక్షల లడ్డూలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ. సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో భారీ ఎత్తున లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రోజూ అమ్మ వారు దర్శనం ఇస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఇవాళ ఐదో రోజు కావడం విశేషం.
Vijayawada Kanaka Durga Today’s Alankaram
శుక్రవారం (ఆశ్వయుజ శుద్ధ చవితి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనం ఇస్తోంది. జగజ్జననీ అయిన శ్రీమహాలక్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భక్తులను సాక్షాత్కరిస్తోంది భక్తులను అనుగ్రహం ఇస్తోంది. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే సమస్త జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళ కారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మం. శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చే కనకదుర్గమ్మకు ఈ రోజున నైవేద్యంగా పంచ భోగాలైన పాయసం, చక్రపొంగలి, లడ్డు, పులిహోర, దద్యోజనాలను నివేదిస్తారు.
Also Read : CM Chandrababu Interesting Comments : టెక్నాలజీతో క్యూలైన్ల నిర్వహణకు ఐసీసీ సెంటర్



















