YS Sharmila : అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) నిప్పులు చెరిగారు. అన్నదాత సుఖీభవ కాదని అన్నదాత దుఖీభవ అని మండిపడ్డారు. కూటమి సర్కార్ చెప్పిన సూపర్ సిక్స్ హామీలన్నీ ఒట్టి కోతలేనంటూ పేర్కొన్నారు. 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారంటూ వాపోయారు. రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ బీజేపీకి తొత్తులేనని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేకంగా దత్తపుత్రుడు జగన్ ఒక్క ఉద్యమం కూడా చేయక పోవడం దారుణమన్నారు. తనకు పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే చేస్తాడన్నారు.
YS Sharmila Shocking Comments on AP Govt
స్వార్థ రాజకీయాలకు జగన్ రెడ్డి నెంబర్ 1 అని ఆరోపించారు. కాంగ్రెస్ లో వర్గపోరు అనేది లేదన్నారు. సీనియర్లు ఎవరు కూడా దూరం కాలేదని చెప్పారు. రాష్ట్రంలో 93 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారని పేర్కొన్నారు. అర్హత పేరుతో సగానికి సగం మంది రైతులకు కోత పెట్టారంటూ ఆరోపించారు.
47 లక్షల మందికే పథకం వర్తింప జేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇది 43 లక్షల మంది మిగతా రైతులకు చేస్తున్న అన్యాయమన్నారు.
వడపోత పేరుతో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు కోత పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు. హామీలు ఇచ్చే ముందు ఎందుకు కోత పెడతాం అని చెప్ప లేదన్నారు. తల్లికి వందనం పథకం కింద కోతలేనన్నారు.
Also Read : Ratha Yatra – Mahant Swami Interesting : రథయాత్ర పర్వదినం సందర్భంగా మహంత్ స్వామి మహారాజ్ ఆశీర్వచనం
















